TG: భవిష్యత్లో జూబ్లీహిల్స్ తమదే అని మాజీ మంత్రి KTR అన్నారు. గతంలో ఇక్కడ తమకు 80 వేల ఓట్లు వస్తే, ఈ ఉపఎన్నికలో దాదాపు 75 వేల ఓట్లు వచ్చాయన్నారు. ఇన్ని కుట్రలు, రిగ్గింగ్ జరిగినప్పటికీ.. తమ ఓట్లు కేవలం 5వేలు మాత్రమే తగ్గాయని పేర్కొన్నారు. కానీ.. భవిష్యత్తులో జూబ్లీహిల్స్లో కచ్చితంగా BRS జెండా ఎగరవేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.