AP: విశాఖలోని సీఐఐ సమ్మిట్లో భాగంగా సీఎం చంద్రబాబు రేమండ్ ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి టీజీ భరత్ హాజరై మాట్లాడారు. ఏపీలో రేమండ్ గ్రూప్ రూ.1,201 కోట్లు పెట్టుబడులు, 3 ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుందని తెలిపారు. రేమండ్ సంస్థ పెట్టుడులు పెట్టడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు.