ప్రకాశం: హనుమంతునిపాడు ఎస్సై మాధవరావు శుక్రవారం రాత్రి వేములపాడు రోడ్డు వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతే కాకుండా తాగి నడపడం వల్ల కలిగే అనర్థాలు, ప్రమాదాల గురించి ఆయన వివరించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.