Mumbai High Court: వ్యభిచారం నేరం కాదంటూ ముంబై హైకోర్టు సంచలన తీర్పు!
సెక్స్ వర్కర్ల(Sex Workers)కు కూడా చట్ట ప్రకారంగా గౌరవం, సమాన రక్షణ ఉంటుందని కోర్టు తెలిపింది. వారి ఇష్టానుసారంగా వేశ్యగా మారడం చట్టవిరుద్దం కాదని కోర్టు స్పష్టం చేసింది. ముంబై హైకోర్టు(Mumbai High Court) తీర్పు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఓ మహిళ కేసు విచారణలో ముంబై హైకోర్టు(Mumbai High Court) సంచలన తీర్పునిచ్చింది. బ్రోతల్ కేసులో అరెస్ట్ అయిన ఆ మహిళను విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. ఆమెను ఇంట్లోనే ఉంచాలనే మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను సైతం కొట్టివేసింది. ఆ మహిళ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించొద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది.
గతంలో కూడా సుప్రీం కోర్టు(Supreme court) ఇలాంటి తీర్పే ఇస్తూ ప్రకటన చేసింది. సెక్స్ వర్కర్ల(Sex Workers) పనిలో జోక్యం చేసుకోకూడదని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వ్యభిచారం అనేది ఒక వృత్తి అని, సెక్స్ వర్కర్ల పనిలో జోక్యం చేసుకోకూడదంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా పోలీసులకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మేజర్లుగా ఉండి తమ ఇష్టంతో వ్యభిచారం చేస్తే అలాంటి వారిపై పోలీసులు క్రిమినల్ కేసులు(Criminal Cases) పెట్టి చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది.
సెక్స్ వర్కర్ల(Sex Workers)కు కూడా చట్ట ప్రకారంగా గౌరవం, సమాన రక్షణ ఉంటుందని కోర్టు తెలిపింది. వ్యభిచారం గృహాన్ని నిర్వహించడం చట్టవిరుద్దమే అయినా కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం దేశంలోని ప్రతి పౌరుడికీ కూడా గౌరవ ప్రదమైన జీవితాన్ని గడిపే హక్కు ఉందని సుప్రీం కోర్టు(Supreme Court) వెల్లడించింది. వారి ఇష్టానుసారంగా వేశ్యగా మారడం చట్టవిరుద్దం కాదని కోర్టు స్పష్టం చేసింది. ముంబై హైకోర్టు(Mumbai High Court) తీర్పు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.