»Kerala Story Inspired A Girl Friend To File Case Against Her Boyfriend In Indore
Love Couple మధ్య చిచ్చుపెట్టిన కేరళ స్టోరీ సినిమా.. తెగిన బంధం
అభూత కల్పనను వాస్తవ కథగా చిత్రీకరించి ఇరు వర్గాల మధ్య వైషమ్యాలు రేకిత్తించేలా తీసిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. ఈ సినిమాకు కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలికి జనాలను చూసేలా ప్రోత్సాహం కల్పించడం తీవ్ర దుమారం రేపింది.
అభూత కల్పనను వాస్తవ కథగా (Fact) చిత్రీకరించి ఇరు వర్గాల మధ్య వైషమ్యాలు రేకిత్తించేలా తీసిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. ఈ సినిమాకు కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలికి జనాలను చూసేలా ప్రోత్సాహం కల్పించడం తీవ్ర దుమారం రేపింది. ఈ సినిమా అనేక వివాదాలకు (Riots) కేంద్రంగా మారింది. తాజాగా ఈ సినిమా వలన ఓ ప్రేమజంట (Love Couple) మధ్య చిచ్చు రేపింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండోర్ (Indore) పట్టణంలోని ఖజ్రానా పోలీస్ స్టేషన్ (Khajrana Police Station) పరిధిలో ఓ ప్రేమ జంట ఉంది. వీరు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమికుడు 12వ తరగతి వరకే చదువుకోగా.. యువతి మాత్రం ఉన్నత చదువులు చదివి ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది. ఇటీవల విడుదలైన కేరళ స్టోరీ సినిమాను వీరిద్దరూ చూశారు. అనంతరం వీరిమధ్య ఆ సినిమా విషయమై గొడవ జరిగింది. ఇది తారస్థాయికి చేరి పోలీసులకు వరకు చేరింది.
ఆ యువకుడిపై యువతి కేసు నమోదు చేయించింది. ప్రేమ (Love) పేరుతో తనను మోసం చేశాడని.. అత్యాచారం కూడా చేశాడంటూ ప్రియుడిపై యువతి తీవ్ర ఆరోపణలు (Allegations) చేసింది. పెళ్లి కోసం తనను మతం మార్చుకోవాలంటూ మానసికంగా వేధిస్తున్నట్లు ఫిర్యాదులో తెలిపింది. దీంతో ఖజ్రానా పోలీసులు యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆ యువకుడిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి దినేశ్ వర్మ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని వెల్లడించారు. కాగా, ఈ సినిమా వలన వారి ప్రేమబంధంలో చిచ్చు రేపింది. ఆ సినిమా (Movie) చూడకపోయి ఉంటే వారిద్దరూ కలిసి ఉండేవారని కుటుంబసభ్యులు, వారి స్నేహితులు చెబుతున్నారు. కాగా, వారిద్దరివి వేర్వేరు వర్గాలు కావడంతోనే ఈ గొడవకు కారణంగా తెలుస్తోంది.