SKLM: జిల్లాపై, కేంద్ర మంత్రి నాయకత్వంపై కొంతమంది వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా నిరాధారమని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. తమ చేతకానితనాన్ని దాచుకోవడానికి కేంద్ర మంత్రిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక సంస్థ అందించే యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డుతో సత్కరించబడిన నాయకుడు రామ్మోహన్ అని అన్నారు.