W.G: పాలకొల్లు మండలం చింతపర్రు పరిధి పెచ్చేటిపాలెంలో నాటు తుపాకీతో వన్యప్రాణలను వేటాడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి కరుణాకర్ తెలిపారు. పాలకొల్లుకి చెందిన షెపర్డ్ చింతపర్రులో వన్యప్రాణలను వేటాడుతున్నట్లు సమాచారం అందగా దాడి చేసి అతని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతని వద్ద నుంచి నాటు తుపాకీ, తెల్ల కొంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు.