కడప: ప్రొద్దుటూరు మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్‌ను కలిసి, నియోజకవర్గంలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాఫియా శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన SPకి వినతిపత్రం అందజేశారు. అసాంఘిక కార్యక్రమాలకు సహకరిస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.