AP: శ్రీకాకుళంలోని NTR మైదానంలో ఇవాళ్టి నుంచి 20 వరకు ‘సిక్కోలు పుస్తక మహోత్సవం’ జరగనుంది. 10 రోజుల పాటు పుస్తకాల ప్రదర్శనతో పాటు సాహిత్య, సాంస్కృతిక, విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేయనున్నారు. వంద వరకు ప్రచురణ సంస్థలు పాల్గొననున్నాయి. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు శాస్త్రవిజ్ఞానం, అంతరిక్షంపై అవగాహన కల్పించడంతో పాటు ప్రత్యేక శిబిరాలు ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు.