ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌కు చెందిన టీచర్ ఓం ప్రకాష్ వర్మకు రూ.2 కోట్ల పన్ను చెల్లించాలని GST అధికారులు నోటీసు ఇచ్చారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన పాన్ కార్డును ఉపయోగించి కోట్ల విలువైన లావాదేవీలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. అయితే తన సంపాదన నెలకు కేవలం రూ. 7,000, ఈ భారీ పన్ను నోటీసుతో తాను తీవ్ర ఆందోళనలో ఉన్నానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.