SRD: అరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం పంటను దళారులకు అప్పగించరాదని TGIIC ఛైర్మన్ నిర్మలారెడ్డి అన్నారు. కంది మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్నిఇవాళ ప్రారంభించారు. ప్రభుత్వం వడ్లకు మద్దతు ధర ఏ గ్రేడ్ రూ. 2389, సాధారణ రకం రూ.2369, సన్న వడ్లకు రూ. 500 బోనస్‌తో కలిపి రూ. 2889 ఇస్తుందన్నారు. ప్రతి రైతు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.