SRPT: అనంతగిరి నుంచి చనుపల్లి వరకు రూ. 20 కోట్లతో చేపట్టిన రహదారి నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. గ్రామ శివారు ప్రాంతాల్లో పనులు పూర్తయిన మండల కేంద్రంలోని రెండు కిలోమీటర్ల మేర విస్తరణ పనులు పెండింగ్లో ఉన్నాయి. రహదారి విస్తరణ వల్ల ఇళ్లు కోల్పోతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు.