PLD: సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కార్తీక మాసం సందర్భంగా ఆదివారం కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇస్సాపాలెంలోని శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు.