ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. కాగా…. కేవలం కవితకు మాత్రమే కాదని ఏపీలో వైసీపీ నేతలకు సైతం నోటీసులు వస్తాయంటూ… వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు బాంబు పేల్చారు. డిల్లీ లిక్కర్ స్కామ్ లో కొందరు వైసీపీ నేతల ప్రమేయం కూడా ఉందంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా.. త్వరలోనే వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డికి దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.లిక్కర్ స్కామ్ లో తన పాత్ర బయట పడుతోందనే భయంతోనే విజయ సాయిరెడ్డి తన ఫోన్ పోయినట్లు నటిస్తున్నారని ఆయన విమర్శించారు. నకిలీ సీబీఐ అధికారు శ్రీనివాస్, ఎంపీ విజయసాయి రెడ్డి మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయన్నారు. సీబీఐ అరెస్ట్ చేసిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ తో తమ పార్టీ నేతలకు సంబంధాలు ఉన్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు.