MNCL: దండేపల్లిలోని పలు గ్రామాల మత్స్యకార సహకార సంఘం సభ్యులకు కాంగ్రెస్ నాయకులు అధికారులు చేప పిల్లలను పంపిణీ చేశారు. శనివారం దండేపల్లిలోని రెబ్బెనపల్లి, కన్నేపల్లి, తాళ్లపేట మత్స్యకార సంఘాల సభ్యులకు వారు 3.42 లక్షల చేప పిల్లలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నాగరాణి త్రిమూర్తి, కాంగ్రెస్ అధ్యక్షులు అక్కల వెంకటేశ్వర్లు ఉన్నారు.