NZB: వాహనాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో పోలీసులకు గంజాయి లభ్యమైంది. ఈ ఘటన బోధన్ పట్టణ శివారులో చోటు చేసుకుంది. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. పట్టణ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా బిలోలి నుంచి బోధన్ వస్తున్న ఆటోను పోలీసులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఒక కేజీ 270 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని, నిందితులని రిమాండ్కు తరలించినట్లు ఆయన వివరించారు.