Thaman : ’బ్లూ‘ తీసి ’బ్రో‘ యాడ్ చేసిన తమన్.. నెటిజన్లు భారీ ట్రోలింగ్
ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర సంగీత దర్శకుల్లో ముందువరుసలో నిలిచారు ఎస్. ఎస్. థమన్(S.S.Thaman). ఆయన టాలీవుడ్(Tollywood) లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలోని సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నారు. కానీ, కెరీర్ మొదటి నుంచి థమన్ ను `కాపీ క్యాట్` అంటూ పిలుస్తారు.
Thaman : ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర సంగీత దర్శకుల్లో ముందువరుసలో నిలిచారు ఎస్. ఎస్. థమన్(S.S.Thaman). ఆయన టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలోని సినిమాలకు మ్యూజిక్(Music) అందిస్తున్నారు. కానీ, కెరీర్ మొదటి నుంచి థమన్ ను `కాపీ క్యాట్`(Copy cat) అంటూ పిలుస్తారు. ఆయన పాప్, విదేశీ ట్యూన్లను కాపీ కొడుతున్నారనే ఆరోపణలు థమన్పై భారీగానే ఉన్నాయి. పలు ట్యూన్లు(Tunes) కూడా అందుకు సాక్ష్యంగా నిలిచాయి. దాంతో అతడు కంపోజ్ చేసిన అన్ని సినిమాల్లో ఏదో ఒక పాట కాపీయే అన్న ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. తాజాగా తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan), ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharum Tej) కాంబోలో రూపుదిద్దుకుంటున్న మల్టీస్టారర్ `బ్రో`(Bro) సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తమిళంలో సముద్రఖని నటించి, దర్శకత్వం వహించిన `వినోదయ సీతం`కు ఈ సినిమా రీమేక్.
కోలీవుడ్ లో డైరెక్ట్ చేసిన సముద్రఖనినే తెలుగులోనూ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందిస్తుంటే.. థమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ సినిమా ద్వారా థమన్ మరోసారి అడ్డంగా బుక్కైయ్యాడు. అయితే నిన్న(గురువారం) ఈ మూవీ టైటిల్ ను చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. థీమ్ సాంగ్ కూడా బయటకు వచ్చింది. ఈ థీమ్ సాంగ్ ఎంతలా ఆకట్టుకుంటో ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఈ థీమ్ సాంగ్ కు థమన్ అందించిన బీజీఎమ్ ఆహా.. ఓహో.. అంటూ పొగిడేశారు. కానీ, ఇప్పుడు ఈ సాంగ్ ను కూడా థమన్ కాపీ చేశాడంటూ ట్రోలింగ్ జరుగుతోంది. అక్షయ్ కుమార్ బ్లూ మూవీలో నుంచి ఈ బ్రో సాంగ్ కాపీ చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఆ సాంగ్ లో ఉన్న బ్లూ అనే పదాన్ని తీసేసి బ్రో పెట్టడం తప్ప మిగతా మార్పులేమీ లేవని.. మక్కీకి మక్కీ దింపేశాడని థమన్ ను నెటిజన్లు ఏకి పారేస్తున్నారు.