»The Government Is Ready To Distribute The Second Batch Of Sheep
Telangana : రెండో విడత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం సన్నద్ధం
రెండోవిడత గొర్రెల పంపిణీపై ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న లబ్ధి దారుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. మొదటి విడత గొర్రెల పంపిణీ పథకం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో అమలు చేశారు.
తెలంగాణ (Telangana) రెండోవిడత గొర్రెల పంపిణీపై ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న లబ్ధి దారుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. మొదటి విడత గొర్రెల పంపిణీ (Distribution of sheep)పథకం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో అమలు చేశారు. ఈసారి పారదర్శకంగా అమలు చేసేందుకు పకడ్బందీగా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. జిల్లాలోని 15మండలాలకు సంబంధించి పథకం సజావుగా అమలు చేసి యదవులకు లబ్ధి చేకూర్చేందుకు మండలానికో జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించారు.పథకం అమలు కాక నాలుగేళ్లు అవుతుండడంతో లబ్ధిదారుల జాబితాను తిరిగి పరిశీలిస్తున్నారు. ఎవరైనా మరణిస్తే వారి నామిని అర్హతను పరిశీ లించి కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇందుకోసం మండలాల వారిగా సమావేశాలు నిర్వహించి పెరిగిన యూనిట్ ధర, లబ్ధిదారులు చెల్లించాల్సిన వాటా తదితర విషయాలపై అవగాహన కల్పిస్తున్నామని అధికారులు తెలుపుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అర్హులకు గొర్రెలు పంపిణీ చేయాలని కలెక్టర్(Collector) హేమంత్ సహదేవరావు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. జాబితాను పునఃపరిశీలించి పూర్తి స్థాయిలో సమీక్షించి జిల్లా స్థాయి అధికారి తుది జాబితాను కలెక్టర్కు అందజేయనున్నారు.మొదటి విడతలో 2901మందికి లబ్ధి చేకూరగా రెండో విడత గొర్రెల పంపిణీలో జిల్లాలో 1509మందికి లబ్ధి చేకూరనుంది. ఇందులో ఇప్పటికే 474మంది వాటా నగదును చెల్లించారు. గతంలో యూనిట్(Units) ధర రూ.1.25 లక్షలు ఉండగా లబ్ధిదారుడి వాటా రూ.31,250 డీడీ రూపంలో చెల్లించారు. ప్రస్తుత యూనిట్ ధర రూ.1.75లక్షలకు చేరగా లబ్ధిదారుడు తన వాటాగా రూ.43,750 చెల్లించాల్సి ఉంటుంది.