MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో స్మశానవాటికల్లో సమస్యలు తీష్ట వేశాయి. 30 వేల జనాభా కలిగిన మున్సిపాలిటీలో రెండే స్మశాన వాటికలు ఉన్నాయి. కానీ దశాబ్దాలుగా అవి అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. కనీసం నీటి సౌకర్యం లేకపోవడంతో బయట నుంచే నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో నిధులు కేటాయించిన పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.