ముంబైలో మోనో రైలు పట్టాలు తప్పింది. అయితే, ట్రైన్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. వడాలా-జీటీబీ స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది కూడా మెట్రో రైలు తరహా లాంటిదే. అదృష్టవశాత్తు రైలు కింద పడలేదు. పైనే ఉంది. కింద పడి ఉంటే తీవ్రమైన ప్రమాదం జరిగేది. మోనో రైలు.. సింగిల్ ట్రాక్‌పై వెళ్తుంది. కొంత వరకు తేలిగ్గా, సన్నగా ఉంటుంది.