ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సులవేసి ద్వీపంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ తెల్లవారుజామున ఉత్తర తీరంలో భూకంపం సంభవించిందని ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. వారం రోజుల్లో అతి పెద్ద రెండో భూకంపంగా దీనిని పేర్కొంది. అయితే సునామీ ప్రమాదం లేదని వెల్లడించింది.