JN: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు చిటకోడూరు వద్ద ఉన్న రోడ్డు తెగిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వాహనదారులు, స్థానికులు వాగు దాటే ప్రయత్నాలు చేయకుండా ఉండేందుకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రజలు గమనించి సాహసాలు చేయకుండా ఇతర దారుల వెంబటి వెళ్లాలని అధికారులు సూచించారు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.