SKLM: పాతపట్నంలో ఈనెల 11వ తేదీ నుండి రాష్ట్రస్థాయి సాఫ్ట్ టెన్నిస్ పోటీలను నిర్వహించనున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ శేఖర్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోటీలు పాతపట్నంలో ఉన్న గిరిజన సామాజిక భవనం ఆవరణంలో జరుగుతాయన్నారు. క్రీడాకారులు ఈ విషయాన్ని గమనించి ఉదయం 9 గంటలకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు నేరుగా సంప్రదించాలన్నారు.