శ్రీమహా విష్ణువు యోగ నిద్ర నుంచి మేలుకునే రోజును ఉత్తాన ఏకాదశి అంటారు. ఇవాళ ఉత్తాన ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరూ స్నానం చేసేటప్పుడు జిల్లెడు ఆకు, మారేడు ఆకు కానీ తల మీద ఉంచుకుని తలస్నానం చేయాలి. అలా స్నానం చేస్తే సమస్త దరిద్రాలు తొలగిపోతాయి. ఇవాళ పాలు, పెరుగు, బియ్యం, పప్పు, అనపకాయ, దోసకాయ.. వీటిలో ఏవైనా సరే దానం ఇచ్చినా అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.