KNR: పశు సంపదను కాపాడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మండల పశు వైద్యాధికారి డాక్టర్ మాధవరావు తెలిపారు. శుక్రవారం ధర్మారం గ్రామంలో 231 పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. పాడి రైతులు తమ పశుసంపదను కాపాడుకోవడానికి తప్పకుండా ముందస్తు టీకాలు వేయించాలని ఆయన సూచించారు. ఈ టీకాల కార్యక్రమంలో అమీర్ ఖాన్, అజహర్, గోపాలమిత్రలు మొండయ్య, పాల్గొన్నారు.