W.G: పాలకొల్లులో ఆకుకూరలకు డిమాండ్ ఏర్పడింది. ఇటీవల వారం రోజుల పాటు వరుసగా కురిసిన వర్షాలకు భీమవరం ప్రాంతంలో పండించే ఆకుకూర పంటలు పూర్తిగా నాశనం అయ్యాయి. దీంతో గోంగూర, తోటకూర, పాలకూర, బచ్చలి, పొన్నగంటి వంటి ఆకుకూరల ఉత్పత్తి తగ్గి డిమాండ్ ఏర్పడింది. దీంతో శాఖాహార ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. ఒక పక్క కాయగూరల ఉత్పత్తి తగ్గి ధరలు అందుబాటులో లేవు.