గత రెండు మూడు రోజులుగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌తో.. ప్రభాస్ ప్రేమలో ఉన్నారనే వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కృతి సనన్‌తో పాటు వరుణ్ ధావన్.. అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్యార్ లేదు, పీఆర్ స్టంట్ కాదని.. మా మధ్య ఏం లేదని చెప్పింది కృతి. వరుణ్ కూడా ఇదంతా ఫేక్ అని రాసుకొచ్చాడు. దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. అలాంటి కామెంట్లు చేయడం ఎందుకు.. మళ్ళీ ఇలా పోస్టులు పెట్టడం ఎందుకని ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మోకాలి గాయం తగ్గిపోవడంతో.. ఇప్పుడు గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ చేయనున్నాడట. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో సలార్, ప్రాజెక్ట్ కె సెట్స్ పై ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సినిమాల షూటింగ్ అప్టేట్స్ లేవు. తాజాగా ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ సెట్స్‌లో జాయిన్ అయినట్టు సమాచారం. దాదాపు పది రోజులపాటు ప్రభాస్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ఇక ఆ తర్వాత డిసెంబర్ మూడో వారంలో ‘సలార్’ సెట్లో జాయిన్ అవుతాడట డార్లింగ్. అక్కడ కూడా కంటిన్యూగా షెడ్యూల్ పూర్తి చేయబోతున్నారట. ఇదే కాదు.. మారుతి సినిమాకు కూడా ప్రభాస్ డేట్స్ ఇచ్చాడని టాక్. ఇప్పటికే ఈ సినిమా చడీ చప్పుడు లేకుండా మొదలైందని అంటున్నారు. ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుందట.. త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారట. అందుకోసం 10 కోట్లతో ఓ థియేటర్ సెట్ వేశారని టాక్. ఇలా రెస్ట్ లేకుండా.. ఈ సినిమాల షూటింగ్స్‌లో పాల్గొనబోతున్నాడట డార్లింగ్.