NLG: శాలిగౌరారం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి పంట తడిసిపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గురువారం వాతావరణం పొడిగా ఉండడంతో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రైతులు అవస్థలు పడ్డారు. ధాన్యం రాశులను ఆరబెట్టడం కోసం కేంద్రాల్లో స్థల సమస్య ఏర్పడడంతో రైతుల మధ్య వాగ్వాదాలు జరిగాయి.