ATP: తాడిమర్రిలోని సీబీఆర్ (చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) గేటు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు తోడు వైవీఆర్ ప్రాజెక్టు నుంచి వస్తున్న నీటితో ఇన్ ఫ్లో 3వేల క్యూసెక్కులకు పైగా పెరిగింది. దీంతో సీబీఆర్ గేటు ఒకటి ఎత్తి 2 వేల క్యూసెక్కులను పార్నపల్లి ఏటికి అధికారులు విడుదల చేశారు.