GNTR: పొన్నూరు వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ తుఫాను బాధిత రైతులకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుఫానుతో నష్టపోయిన ప్రతి ఎకరాకు తక్షణ సాయంగా రూ.20 వేలు, అదనంగా రూ.30 వేలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ఆయన కోరారు. బుధవారం ఆయన వెల్లలూరు, మామిళ్ళపల్లి గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించి, రైతులకు భరోసా ఇచ్చారు.