W.G: మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో నీట మునిగిన పంటల వివరాలను ఐదు రోజుల్లో సేకరించి నివేదిక సమర్పించాలని జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన కార్యాలయం నుంచి మొంథా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాల వలన నీట మునిగిన పంటల వివరాలను తెలుసుకునేందుకు సంబంధిత శాఖల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు.