విశాఖ: దేవదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు గ్రేడ్-2 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు పదోన్నతి లభించింది. టర్నర్ చౌల్ట్రీ ఈవో అల్లు జగన్నాథరావు, విజయనగరం జిల్లా ఎస్. కోట సమీపంలోని కొట్టం గ్రామంలో ఉన్న శ్రీ కోటమ్మ అమ్మవారి దేవస్థానం ఈవో జి. శ్రీనివాసరావు లను గ్రేడ్-1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పిస్తూ దేవదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.