DK Shivakumar:కర్ణాటక సీఎం అభ్యర్థి ఎంపిక కొలిక్కిరాలేదు. సిద్దరామయ్య-డీకే శివకుమార్ (DK Shivakumar) మధ్య పోటీ ఉంది. ఢిల్లీ రావాలని డీకే శివకుమార్‌కు పిలుపు రాగా.. కాసేపటి క్రితం బయల్దేరారు. హస్తిన వెళ్లే ముందు డీకే శివకుమార్ (DK Shivakumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను ఒంటరిగా ఢిల్లీ రావాలని కోరారని.. సింగిల్‌గా వెళ్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాను అని మాట ఇచ్చాను.. గెలిపించాననని వివరించారు. తనకు అప్పగించిన డ్యూటీ చేశానని పేర్కొన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది.. దేవాలయం లాంటిదని మరోసారి ప్రకటించారు.
సీఎం సీటు ఇస్తారో లేదో చూడాలి అని డీకే శివకుమార్ అన్నారు. ఢిల్లీ వెళ్లేందుకు బెంగళూరులో కారులో ఎయిర్ పోర్టుకు వెళుతుండగా.. ఏఎన్ఐ ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. మెజార్టీ సభ్యుల సీఎం అభ్యర్థిని తానే అని చెప్పారు. సీఎం అభ్యర్థి ఎంపిక హైకమాండ్‌దేనని చెప్పారు. తాను ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయనని.. ఒత్తిడి తీసుకురానని వివరించారు. కర్ణాటకలో తమకు 135 ప్లస్ సభ్యుల మద్దతు ఉందని.. తాను ఎవరినీ విడదీయనని డీకే శివకుమార్ (DK Shivakumar) వివరించారు. ఇండిపెండెంట్ సభ్యులు కూడా తమకు సపోర్ట్ చేస్తారని వివరించారు. వారికి నచ్చినా..నచ్చకున్నా బాధ్యత గల మనిషిని, వెన్నుపోటు పొడవను అన్నారు. పార్టీని నిర్మించుకున్నామని.. అందులో తాను కూడా భాగమేనని తెలిపారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 72 గంటలు అవుతున్నా.. సీఎం అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎంగా ఎవరినీ కూర్చొబెట్టాలనే అంశంపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. చెరి రెండున్నరేళ్లు సీఎం పదవీ చేపట్టేందుకు సిద్ధరామయ్య అంగీకరించగా.. డీకే శివకుమార్ (DK Shivakumar) మాత్రం ఒప్పుకోవడం లేదు. సీఎం పదవీని వదులుకునేందుకు సిద్ధంగా లేరు. వాస్తవానికి ఈ సారి ఎన్నికల్లో అంతా డీకే పేరు మీద నడిచింది. ప్రతీ అభ్యర్థి విజయం కోసం కృషి చేశారు.
డీకే (DK Shivakumar) కోసం వొక్కలిగ మఠాధిపుతుల కూడా తీర్మానం చేశారు. ఆయననే సీఎం చేయాలని అభిప్రాయపడ్డారు. సిద్ధరామయ్యకు కూడా ఎమ్మెల్యేల మద్దతు ఉంది. డీకే- సిద్దూ ఇద్దరు సమ ఉజ్జీవులు.. డీకే 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే.. సిద్ధరామయ్య 9 సార్లు విజయం సాధించారు. 2013 నుంచి 2018 వరకు సిద్ధరామయ్య సీఎంగా పనిచేశారు. ఆ సమయంలో డీకే శివకుమార్ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు సీఎం పదవీపై ఆశ పెట్టుకొని.. తనకే పదవీ వరిస్తోందని ఆశతో ఉన్నారు.