Centre Warns Govt Hospitals: Prescribe Generic Medicines Or Face Action
Centre Warns Govt Hospitals: ప్రభుత్వ ఆస్పత్రులకు (Govt Hospitals) కేంద్ర ప్రభుత్వం (central government) హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆసుపత్రులు, సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్లలోని వైద్యులకు జనరిక్ మందులను సూచించాలని లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సిజిహెచ్ఎస్) వెల్నెస్ సెంటర్లు, పాలీక్లినిక్లలోని వైద్యులకు జెనరిక్ మందులను మాత్రమే సూచించాలని పదే పదే ఆదేశాలు చేశారీ చేశారు.
ప్రభుత్వ వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులకు తక్కువ ధరకు లభించే జనరిక్ మందులనే సూచించాలని స్పష్టం చేసింది. ఈ రూల్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆసుపత్రుల్లో మెడికల్ రిప్రజెంటేటివ్ల రాకపోకలపై కూడా పరిమితి ఉండాలని వైద్యులకు సూచించింది.
ఈ మేరకు వైద్య సేవల డైరెక్టర్ జనరల్ అతుల్ గోయల్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. వైద్యులు తమ రోగులకు బ్రాండెడ్ ఔషధాలు ప్రిస్క్రైబ్ చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసినట్టు వివరించారు.