MDK: శివంపేట మండల కేంద్రంలో బుధవారం జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు యాంటీ నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. శివంపేట ఆర్టీసీ బస్టాండు, హోటళ్ళు, పరిసర ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగం ఉన్నట్లయితే గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పదంగా కనబడితే సమాచారం అందజేయాలని కోరారు.