WNP: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో వనపర్తి డిపో నుంచి జాతరకు వెళ్లడానికి 20 బస్సులను కేటాయించినట్లు DM దేవేందర్ గౌడ్ తెలిపారు. వీటిలో 5 బస్సులు కొత్తకోట నుంచి బయలుదేరుతాయని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ బస్సులలో మహిళలకు మహాలక్ష్మి సౌకర్యం వర్తిస్తుందన్నారు.