సత్యసాయి: సచివాలయంలో ‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో వైద్య శాఖ చేపట్టిన చర్యలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. తుఫాన్ కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రతి జిల్లాలో అధికారులు కృషి చేసి, నదీ తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. వైద్య సేవలు, అత్యవసర సదుపాయాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయన్నారు.