KTR:వచ్చే పదేళ్లలో 15 లక్షల మందికి ఐటీ రంగంలో ఉపాధి కలుగుతుందని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. హైదరాబాద్ శివారు కొంగరకలాన్‌లో ఫాక్స్ కాన్ కంపెనీకి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మరో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫాక్స్ కాన్ చైర్మన్ యాంగ్ లియూ తదితరులు పాల్గొన్నారు. తర్వాత మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఎలక్ట్రానిక్స్ సంస్థ ఫాక్స్ కాన్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ (KTR) తెలిపారు. దేశంలో ఐటీ ఉద్యోగాల్లో మూడింట ఒక ఉద్యోగం మనదేనని చెప్పారు. రెండున్నర నెలల్లో ఫాక్స్ కాన్ కంపెనీ శంకుస్థాపన పూర్తి చేశామని మంత్రి తెలిపారు. సంస్థకు అన్నివిధాలుగా అండగా ఉంటామని చెప్పారు. ఏడాదిలో ఫాక్స్ కాన్ కంపెనీ భవన నిర్మాణం పూర్తి అయి.. అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నానని తెలిపారు.
ఫాక్స్ కాన్ కంపెనీలో తొలుత 25 వేల ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ (KTR) తెలిపారు. యువత కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు.
A landmark day for Telangana!
IT and Industries Minister @KTRBRS broke ground for Foxconn Interconnect Technology's electronics manufacturing facility at Kongara Kalan, Rangareddy in the presence of the company's Chairman and CEO, Sidney Lu.
— KTR, Former Minister (@MinisterKTR) May 15, 2023
కొంగరకలాన్‌లో రూ.1655 కోట్ల పెట్టుబడితో ఫాక్స్ కాన్ సంస్థ ఏర్పాటు చేస్తోన్న సంగతి తెలిసిందే. కంపెనీ నిర్మాణం పూర్తయితే 35 వేల మంది స్థానికులు ఉపాధి లభిస్తోంది. కంపెనీ కోసం తెలంగాణ ప్రభుత్వం 196 ఎకరాల భూమి కేటాయించిన సంగతి తెలిసిందే.