NRML: జిల్లాలో వైద్య వ్యర్థాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు. మంగళవారం ఆస్పత్రి వైద్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆసుపత్రులు,నర్సింగ్ హోమ్‌లు, పశువైద్య కేంద్రాలు శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాలను నిర్వీర్యం చేయాలని ఆదేశించారు. వ్యర్థాలు పారేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.