కర్ణాటక కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రకటన ఆ పార్టీ హైకమాండ్‌కు కత్తిమీద సాము అవుతుంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లో ఎవరో ఒకరి ఎంపిక చేసేందుకు ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతుంది.
Siddaramaiah:కర్ణాటక సీఎం రేసు గురించి గంటకో కొత్త అప్ డేట్ వస్తోంది. రేసులో ఉన్న సిద్ధరామయ్య (Siddaramaiah), డీకే శివకుమార్ తమ శక్తి మేరకు లాబీయింగ్ చేస్తున్నారు. పరిశీలకులు సీఎం అభ్యర్థిని ఎంపిక చేయకపోవడంతో ఓవర్ టూ ఢిల్లీ అంటున్నారు. ఈ క్రమంలోనే సిద్ధరామయ్య (Siddaramaiah) ఢిల్లీ పయనం అయ్యారు. డీకే కూడా హస్తినలో రణదీప్ సుర్జేవాలాతో సమావేశం అయ్యారు. దాదాపు మూడు గంటల పాటు సుధీర్ఘంగా డిస్కష్ చేశారు. ఇస్తే సీఎం పదవీ ఇవ్వండి.. లేదంటే లేదు అని తెగేసి చెప్పారు. కనీసం మంత్రి పదవీ కూడా అక్కర్లేదని గట్టిగానే చెప్పారని తెలిసింది.
మరోసారి తనకు సీఎం పదవీ ఇవ్వాలని సిద్ధరామయ్య.. రాహుల్ గాంధీని కోరే అవకాశం ఉంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన రెండున్నరేళ్ల ప్రతిపాదనకు సిద్దూ అంగీకరించిన డీకే ససేమిరా అన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శక్తిమేరకు కష్టపడ్డాడు. అందుకే కాబోలు నో అన్నారు. నేతలతో మంతనాలు, క్యాంపెయిన్ చేయడం, పార్టీని ఏకతాటిపైకి నడపడంలో డీకే విశేష కృషి చేశారు.
సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని పరిశీలకులు కోరారట.. మెజార్టీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకు ఓకే చెప్పినట్టు తెలిసింది. అనుభవం.. ఓ సారి సీఎంగా పనిచేసి ఉండటం ఆయనకు కలిసి వచ్చింది. సిద్దూను (Siddu) దాదాపు 80 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు. డీకేకు మద్దతు తెలిపే వారి సంఖ్య 57కి తగ్గింది. సీఎం అభ్యర్థిని నిర్ణయించేందుకు ఇదే అంశాన్ని ప్రతిపాదికగా తీసుకుంటే.. డీకే వెనకబడినట్టే అవుతుంది.
డీకే శివకుమార్.. గాంధీ కుటుంబానికి నమ్మిన బంటు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ సారి అన్నీ తానై నడిపించారు. సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రచారం చేసినప్పటికీ అంతగా ప్రభావం ఉండదనే వారు ఉన్నారు.