E.G: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఆదేశించారు. జిల్లాలో 9 మండలాలు, 303 గ్రామాలు తుఫాన్‌తో ప్రభావితమయ్యే అవకాశం ఉందని చెప్పారు. 12 మండలాల్లో కంట్రోల్ రూమ్ లు, 184 పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉంచినట్లు ఆమె స్పష్టం చేశారు.