KNR: తిమ్మాపూర్ మండలంలోని ప్రైవేట్ హాస్టల్స్ యాజమాన్యంతో సీఐ సదన్ కుమార్, ఎస్సై శ్రీకాంత్ గౌడ్ సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాస్టల్స్లో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గంజాయి సేవిస్తున్న విద్యార్థులు ఉన్నట్లు అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆదేశించారు. రాత్రి 10 గంటల తర్వాత విద్యార్థులను బయటకు పంపకుండా చూడాలన్నారు.