MBNR: మిడ్జిల్ మండలం రాణిపేట్ గ్రామంలో సోమవారం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.. రైతుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ, పత్తి రైతులు సరైన ధర పొందే విధంగా Cotton Corporation of India (CCI) ద్వారా నేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు.