Gold Rate Hike:మూఢాలు వెళ్లి పెళ్లి ముహూర్తాల సమయం వచ్చేసింది. మ్యారేజ్లు ఎక్కువగానే జరుగుతున్నాయి. ఇంకేముంది బంగారం (Gold) ధరలకు రెక్కలు వస్తున్నాయి. పెళ్లిళ్లు, పెరంటాలకు గోల్ట్ కొనుగోలు తప్పనిసరి.. అందుకే పసిడి ధర పైపైకి వెళుతుంది.
బంగారం (Gold) ధర శనివారం కాస్త తగ్గినట్టు అనిపించినా.. ఆదివారం మళ్లీ పెరిగింది. అమెరికా డాలర్ బలపడటంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం (Gold) ధర తగ్గింది. ప్రస్తుతం ఔన్స్ 2015 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (Gold) ధర రూ.56,800 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం రూ.61.950గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 61,680గా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,650 ఉంది. నిన్నటితో పోలిస్తే గ్రాముకు రూ.10 చొప్పున పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,800గా ఉంది.
హైదరాబాద్లో నిన్న 22 క్యారెట్ల బంగారం (Gold) గ్రాముకు రూ.5655 ఉండగా.. ఈరోజు రూ.5665గా ఉంది. అంటే గ్రాముకు రూ.10 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం నిన్న గ్రాముకు రూ.6169 ఉండగా.. ఈ రోజు రూ.6180గా ఉంది. ఇదీ కూడా గ్రాముకు రూ.11 పెరిగింది.