SS: మంత్రి సత్యకుమార్ యాదవ్కు చెందిన సంస్కృతి సేవా సమితి నిర్వహించిన ఉచిత బ్యాంకింగ్ కోచింగ్ ప్రవేశ పరీక్షలో, 120 మందిలో 12 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన వారికి నవంబర్ 9 నుంచి శిక్షణ ప్రారంభించనున్నారు. ఎంపికైన వారికి మంత్రి సత్యకుమార్ సర్టిఫికెట్లు అందజేశారు. విద్యార్థులు బాగా చదివి కుటుంబానికి, సమాజానికి గౌరవం తీసుకురావాలని సూచించారు.