BDK: భూ నిర్వాసితులకు, సింగరేణి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాసర్ పాషా కోరారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు సింగరేణి ఆధ్వర్యంలో మణుగూరులో మెగా జాబ్ మేళా నిర్వహించాలని ఆయన ఏరియా జీఎం శ్రీనివాస్‌కు శనివారం వినతి పత్రం అందజేశారు.