TG: RR జిల్లా శేరిలింగంపల్లిలో రూ.86 కోట్ల విలువైన భూమిని హైడ్రా రక్షించింది. రాఘవేంద్ర కాలనీలో 2000 గజాల పార్కు స్థలంతో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన 4300 గజాల స్థలాన్ని కాపాడింది. హైడ్రా ప్రజావాణిలో అందిన ఫిర్యాదుతో అధికారులు పరిశీలించి ఆ ఆక్రమణలు తొలగించారు. ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది.