RR: నార్సింగి పురపాలక సంఘం పరిధిలో అభివృద్ధి పనులను రాజేంద్రనగర్ MLA ప్రకాష్ గౌడ్ శనివారం ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు. మంచిరేవులలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన, బీటీ రోడ్డు వెడల్పు, ఫుట్ పాత్ నిర్మాణం, మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవాలు చేసినట్లు MLA తెలిపారు. నార్సింగి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.