MDK: పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయించాలని తూప్రాన్ పశువైద్యాధికారి డాక్టర్ లక్ష్మిరెడ్డి పేర్కొన్నారు. శనివారం మనోహరాబాద్ మండలం గౌతోజిగూడ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేశారు. పశువులకు వ్యాధులు రాకుండా ముందస్తుగా టీకాలు వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రాజిరెడ్డి, చిరంజీవి, గోపాలమిత్ర రామస్వామి పాల్గొన్నారు