కృష్ణా: మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, విజయలక్ష్మి దంపతులు వైభవంగా నాగుల చవితి ఉత్సవాలను శనివారం తెల్లవారుజామున నాగ పుట్ట వద్ద తొలి పూజ నిర్వహించి ప్రారంభించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు ఆలయ అర్చకులు బుద్దు పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో అర్చక బంధం,ఆలయ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వాగతం పలికారు.